…
-విజేత విద్యాసంస్థల కరస్పాండెంట్ మధుకర్.
మిర్యాలగూడ, జనం సాక్షి. పట్టణం లోని విజేత డిగ్రీ కళాశాలలో గురువారం నాడు 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కరస్పాండెంట్ మధుకర్ తెడ్ల మాట్లాడుతూ బ్రిటిష్ వలస పాలన నుండి స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న భారతదేశంలో ప్రజలకు అన్ని రకాల స్వాతంత్ర్యాలు దక్కాలంటే చర్చల ఆధారితమైన సూత్ర నియమాళి అనే సజీవ పత్రం అవసరం అని దానిని రాజ్యాంగం అంటున్నాం.గాంధీ, నెహ్రూ అంబేద్కర్ ఆలోచనల కూడలి భారత రాజ్యాంగం రాజ్యాంగం అంటే పుస్తకం కాదు.నవల కాదు అది పౌరులకు కావలసిన అన్ని అవకాశాలను అందిస్తుంది.అంబేద్కర్ అభిప్రాయం ప్రకారం మనం వైవిధ్య భారతదేశంలోకి అడుగుబెడుతున్నాం.ప్రజలందరూ అనేక అసమానతలతో నిండి ఉన్నారు.పీడిత, అణగారిన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు దక్కకపోతే దానిని తగలబెట్టడంలో ప్రజలే ముందు ఉంటారు. ప్రజాస్వామ్యం మనగలగాలంటే పౌరులకు స్వేచ్ఛ , పౌరసత్వం అవసరం. స్వేఛ్చాయుత వాతావరణంలో పౌరులకు కావలసిన హక్కులు,ప్రభుత్వాలకు మార్గదర్శకాలుగా ఉండటానికి ఆదేశిక సూత్రాలు ఉన్నాయి.అలాగే పరిపాలన వ్యవస్థ సక్రమంగా కొనసాగించటానికి శాసన,కార్యానిర్వాహక, న్యాయ శాఖల అధికారులు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు అన్ని రాజ్యాంగం ద్వారా సంక్రమించాయి.రాజ్యాంగ అమలు పాలకుల పైనే ఆధారపడి ఉంటుంది.రాజ్యాంగ అమలు క్రమంలో అనేక రాజ్యాంగ సంస్థలు ఏర్పడి ప్రజల విశ్వాసాలను,ప్రజా ఆకాంక్షల మేరకు ప్రణాళిక బద్ధంగా భారత దేశ అభివృద్ధి జరిగింది.74 భారత రాజ్యాంగ ప్రయాణంలో భారతదేశ రాజ్యాంగానికి సవరణలు చేయమనే స్థితి నుంచి రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే స్థితి ఏర్పడింది.కాబట్టి ఈ వైవిధ్యత కలిగిన కలిగిన భారత రాజ్యాంగాన్ని వైరుధ్యాలు లేని రాజ్యాంగంగా ప్రజలే కాపాడాలన్నారు. అలాగే విజేత డిగ్రీ కళాశాలలో ప్రతినిత్యం జరిగే అనేక రకాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి విద్యార్థులు చేసుకోవాలని కోరారు. పారా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణ మాట్లాడుతూ అఖండ భారత్ గా పిలవబడిన భారతదేశాన్ని కలిపి ఉంచింది, భారత రాజ్యాంగ, ప్రభుత్వాలు సంవిధాన్ కు లోబడి ఆ వ్యవస్థల ప్రాథమిక నిర్మాణానికి భంగం కలిగించకుండా పరిపాలన కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ ఆలీ, మధు,శీను, యాదగిరి, సైదాచారి, సంధ్య, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగాన్ని రక్షించే ప్రజలే నిజమైన దేశ భక్తులు




