Wednesday, 4 November 2026

జోగులాంబ ఆలయాన్ని దర్శించుకున్న అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కే. శ్రీనివాస రెడ్డి

 

 

 

అలంపూర్ జనంసాక్షి (జూలై 10)అలంపుర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను సోమవారం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కే. శ్రీనివాస రెడ్డి దర్శించుకున్నారు . వీరికి ఆలయ ఈ.ఓ. పురేందర్ కుమార్, ముఖ్య అర్చకులు డి. ఆనంద్ శర్మ లు స్వాగతం పలికారు..ఉభయ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేయించి శాలువా పూలమాల వేసి మెమోంటో అందజేశారు. అనంతరం వేద పండితులతో తీర్థప్రసాదాలు, వేద ఆశీర్వచనం చేయించారు. వీరి వెంట అలంపూర్ ఎస్ ఐ మహీందర్ ఉన్నారు.