Monday, 2 November 2026

జోడోయాత్రకు బయలుదేరిన . పొన్నాల సైన్యం

జోడోయాత్రకు బయలుదేరిన . పొన్నాల సైన్యం
బచ్చన్నపేట నవంబరు 1(జనం సాక్షి) కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన జోడు యాత్రకు మద్దతుగా బచ్చన్నపేట నుండి అధిక సంఖ్యలో బయలుదేరినట్లు . కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వంచా వెంక రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో జరుగుతున్నటువంటి అవినీతిపై దేశవ్యాప్తంగా పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ డైనమిక్ లీడర్ రాహుల్ గాంధీ తెలియజేయుటకు ప్రజల వద్దకు వస్తున్నాడని అందులో భాగంగానే ఈరోజు హైదరాబాదులోని నెక్లెస్ రోడ్ లో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు జనగామ జిల్లా నుండి అధిక సంఖ్యలో వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కోడూరి మహాత్మ చారి. ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు చెరుకూరి శ్రీనివాస్
నక్కవానిగూడెం ఉపసర్పంచ్ కొయ్యడ శ్రీనివాస్. సీనియర్ నాయకులు పిన్నింటి నారాయణరెడ్డి. బొమ్మన రాజయ్య. బండారి మల్లయ్య. గొర్ల అబ్బయ్య. ఎండి యూసుఫ్. గంధ మల్ల నరసింహులు. మల్లం వెంకటనారాయణ. ఉన్నారు