గోడు బై ఎలక్షన్ లో ధర్మపురి బిజెపి నాయకులు పాల్గొన్నారు
ధర్మపురి మునునవంబర్ (జనం సాక్షి న్యూస్) మునుగోడు బై ఎలక్షన్లో బీజేపీ జాతీయ నాయకుడు మునుగోడు నియోజకవర్గ ఎలక్షన్ ఇంచార్జ్ మాజీమంత్రి డాక్టర్ గడ్డం వివేక్ పిలుపుమేరకు ధర్మపురి పట్టణ నాయకులు బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి, గెలుపు కోస గడపగడపకు ప్రచారం చేయడం జరిగిందని,జనం సాక్షి ప్రతినిధికి తెలిపారు అధ్యక్షుడు గాజు భాస్కర్ మాట్లాడుతూ, టిఆర్ఎస్ అక్రమాలు అవినీతిని ప్రజలకు వివరిస్తూ, బిజెపి పార్టీకి ఓటు వేస్తే కలిగే ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను వివరిస్తూ ప్రచారం చేయడం జరిగిందని, మునుగోడు ప్రజలు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఓటు వేసి మెజార్టీతో గెలిపిస్తామని వ్యక్తం చేశారంటూ ఆయన మీడియా తెలిపారు. ఈ కార్యక్రమంలో బి జె వైఎం మండల అధ్యక్షుడు నార్ల విజయకుమార్,బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కోరుట్ల మల్లికార్జున్, నాయకులు శివ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.




