జోరుగా సాగుతున్న కారు ప్రచారం..

ప్రచారం లో దూసుకోపోతున్న రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త

నల్గొండ బ్యూరో, జనం సాక్షి
రాష్ట్రం లో తెరాస చేస్తున్న అభివృద్ధిని చూసి మా గ్రామం లో కూడా అభివృద్ధి కావాలని అందుకు కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ గారి కి బహుమతి గా ఇచ్చి ఆయన ఋణం తీర్చుకుంటాం అంటున్న ప్రజలు

మా పెద్దకొడుకు కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల తోటే మా జీవనం గడుస్తుంది అని అంటున్న వృద్ధులు

టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం ప్రచారంలో భాగంగా మునుగోడు పట్టణ కేంద్రంలో ఆర్యవైశ్య సోదర సోదరీ మణుల ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి అత్యంత భారీ మెజార్టీగా గెలిపించాలని ఓటర్లను కోరిన రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరి ఓటరు ఇంటి వద్దకు వెళ్లి వివరించడం జరిగింది. ఆర్యవైశ్య అభివృద్ధి సాధించాలంటే కేవలం తెరాస తోనే సాధ్యం అని, తెరాస ప్రభుత్వం ఆర్యవైశ్యులని అన్ని విధాలా ఆదుకుంటుంది అని ఆయన అన్నారు.
గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని పనిని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు తెలంగాణ సాధించుకున్న తర్వాత పేదల ఇండ్లలో వెలుగులు నింపాలని ఆయన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు అదేవిధంగా చూసి తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని అన్నారు. ఒకప్పుడు గ్రామాలలో తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడటం చూసి ప్రతి ఒక్కరికి గొంతు తడవాలని మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు అందించిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు.తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక గుజరాత్ గులాములు ఏదో ఒక రూపంలో కెసిఆర్ గారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని అటువంటి ప్రచారాలను ఎవరు నమ్మవద్దు అని అన్నారు
ప్రధానమంత్రి మోడీ రైతుల వ్యవసాయ బావుల దగ్గర మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పితే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా తెలంగాణ రైతులకు నేను మీటర్లు పెట్టను అని చెప్పిన నాయకుడు కేసీఆర్ అన్నారు.డబ్బు మదంతో కాంట్రాక్టుల కోసం మునుగోడు నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టి ప్రజలను మోసం చేసి గుజరాత్ గులాం లతో కలిసి బీజేపీ లో చేరిన రాజగోపాల్ రెడ్డికి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పి కారు గుర్తుని గెలిపించుకుని ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారికి బహుమానంగా ఇస్తే మునుగోడు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.
కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర తొలి మహిళా ఉప్పల స్వప్న, ఇంటర్నేషనల్ వైశ్యపరేషన్ ఫెడరేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ కూర నాగరాజు, జిన్నం వేణు, గందే వెంకన్న, రంగ భాస్కర్, వంగ మల్లారెడ్డి, శ్రీరామ్ శ్రీనివాస్, పిట్ల కృష్ణ, గోరెంటి సత్యనారాయణ, నరేష్, స్థానిక 9వ వార్డ్ మెంబర్ ఎడవల్లి సత్యవతి సురేష్ కుమార్, కలకొండ మణిమాల, కె.స్వప్న, జూలకంటి వాణి, తెరాస సీనియర్ నాయకురాలు గీత గుప్తా, సరిత స్థానిక తెరాస నాయకులు, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.