జ్ఞానోదయ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 06, జనంసాక్షి:
మెట్ పల్లి పట్టణం వెంపేట శివారులోని వెంకటేశ్వర స్వామి ఫంక్షన్ హల్ లో జ్ఞానోదయ డిగ్రీ కళాశాలకు చెందిన 2003 – 2006 బీయస్సి BZC కి చెందిన డిగ్రీ బ్యాచ్ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని కుటుంబ సమేతంగా సంబరాలు జరుపుకున్నారు.విద్యార్థులందరు కళాశాలలో చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు.డిగ్రీ చదివి 16 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా ఆట, పాటలు పాడుకుంటు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.విందు భోజనం ఏర్పాటు చేసుకుని సహాపంక్తి భోజనాలు చేశారు.అనంతరం గాజంగి జయకృష్ణ శరణ్య దంపతుల పిల్లల పుట్టుదోతుల కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులతో పాటు కళాశాల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ పాల్గొన్నారు
జ్ఞానోదయ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం




