ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు
గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (6): మండల కేంద్రంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వేడుకలు నిర్వహించారు గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు సమ సమాజ స్థాపన కోసం సమానత్వం కోసం ఆయన కృషి తినలేనిదని చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పింది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారుభారత రాజ్యాంగ శిల్పి ప్రజాస్వామ్య పరిరక్షకుడు సంఘసంస్కర్త మహా మేధావి న్యాయ శాస్త్రవేత్త అంబేద్కర్ అని ఆయన కొనియాడారు బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే దేశం సుస్థిరంగా ఉంది అని చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పింది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, కోఆప్షన్ సభ్యులు మతిన్, ఉప సర్పంచ్ శివ, వార్డు సభ్యులు బాలస్వామి, కారోబార్ బాబు, కాశీనాథ్, పానుగంటి శేఖర్, పంచాయతీ కార్యదర్శి బాలరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ రాములు తదితరులు పాల్గొన్నారు




