జనంసాక్షి, మంథని : సామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి, అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా మంథని పట్టణంలోని వారి విగ్రహానికి మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ, ఇతర ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. జ్యోతిబా పూలే చెప్పిన బాటలో పయనిద్దామని ఆయన పిలుపునిచ్చారు.
జ్యోతిబాపూలే విగ్రహానికి నివాళులు అర్పించిన జడ్పీ చైర్మన్




