Thursday, 5 November 2026

ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి 

 

 

 

 

 

 

 

టేకులపల్లి, ఏప్రిల్ 11( జనం సాక్షి ): టేకులపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్, తహసిల్దార్ కార్యాలయాలలో మంగళవారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ భూక్య రాధా మహాత్మా జ్యోతిరావు పూలే  చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత మాత ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంటరానితనాన్ని రూపుమాపటానికి కృషిచేసిన సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే మహిళ అభివృద్ధికి మార్గదర్శి,నిత్య స్ఫూర్తిప్రదాత,అన్యాయాలను రూపుమాపడానికి తన జీవితాన్ని ధారపోసిన మహాత్ముడు జ్యోతిరావు పూలే  అని కొనియాడారు. అదేవిధంగా తహసిల్దార్ కార్యాలయంలో కూడా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో   బిఆర్ఎస్  పార్టీ మండల అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్, చీమల సత్యనారాయణ, భూక్య సైదులు, బర్మావత్ శివకృష్ణ, ఎంపీడీవో ఆఫీస్ సిబ్బంది సూపర్డెంట్ శ్రీనివాస్, టైపిస్ట్ శ్రీలత, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.