బచ్చన్నపేట జూన్ 13 (జనం సాక్షి)
ప్రభుత్వపాఠశాలకళాశాలలోచదువుతున్నవిద్యార్థులను మనోధైర్యాలను నింపాలనే ఉద్దేశంతో తమ వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులను సన్మానిస్తున్నట్లు రిలయన్స్ ట్రేoడ్స్ సంస్థ బ్రాంచ్ సేల్స్ మేనేజర్ దండు దయాకర్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి బ్రాంచ్ లో బచ్చన్నపేట మండలంలో తెలంగాణ ఆదర్శ ప్రభుత్వ పాఠశాల,కళాశాలల్లో 2023 సంవత్సరంలో ఉత్తమ ప్రతిభను కనబరిచి పదవ తరగతి, మొదటి రెండవ సంవత్సరం లో టాపర్స్ గా నిలిచిన విద్యార్థిని విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఈ సన్మానంతో విద్యార్థిని విద్యార్థులు మున్ముందు ఉత్తమ ఫలితాలను సాధిస్తారని ఉద్దేశంతో సన్మానం చేస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు చేర్యాల ప్రాంతంలోని చుట్టుపక్కల గ్రామాల పాఠశాలల కళాశాలలో చదువుతున్న పేపర్లుగా నిలిచిన 30 మందిని సన్మానించినట్లు తెలిపారు.సన్మానం పొందిన వారిలో సందెల మేఘన ఎంపీసీ సెకండ్ ఇయర్ ఫస్ట్ ర్యాంకు, కే అమూల్య బైపిసి ఫస్ట్ ర్యాంక్, బి సౌన్య సీఈసీ ఫస్ట్, వి దివ్య ఎంపీసీ ఫస్టియర్ ఫస్ట్, బి అఖిల బైపిసి ఫస్ట్ ఇయర్ ఫస్ట్, ఈ దీక్షిత సిసి ఫస్టియర్ ఫస్ట్, బి ప్రియా పదవ తరగతి ఫస్ట్, బి కీర్తన 10వ తరగతి సెకండ్లకు సన్మానం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు స్వర్గం నర్సింలు, బ్రాంచ్ సిబ్బంది మధు, రాజేష్ ,ప్రశాంత్ ,సంధ్య, శిరీష అలాగే విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
టాపర్స్ లను గుర్తించి ఘనంగా సన్మానించిన రిలయన్స్ ట్రేoడ్స్ సంస్థ




