Wednesday, 4 November 2026

మహిళా సంక్షేమానికి దేశంలోనే విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి

.భువనగిరి టౌన్ జనం సాక్షిభువనగిరి పట్టణంలో ఏకే ప్లాజా ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సభకి ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేశారు…ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…మహిళలకు తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు…మహిళా సంక్షేమానికి దేశంలో మరే ఇతర రాష్ట్రం ప్రవేశపెట్టని విప్లవాత్మక పథకాలను, కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నది. మహిళల ఆరోగ్య పరిరక్షణకు, భద్రతకు, వారు అన్ని రంగాలలో రాణించేందుకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని తెలియజేశారు…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నీటి కష్టాలు ఉండేవని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్మించుకున్న కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు మరియు ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్ గారిది అని తెలియజేశారు…