చిలప్ చెడ్/ఏప్రిల్/జనంసాక్షి :- టిఆర్ఎస్ పార్టీలో ఉన్న పట్టించుకునేనికే పుట్టగతులు లేవని చిలప్ చెడ్ మండలం చండూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు గడ్డం నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం నాడు చిలప్ చెడ్ రైతు వేదిక (శిలంపల్లి)లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి చీఫ్ గెస్ట్ గా నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి హాజరయ్యారు. కార్యకర్తల సమావేశoముందే బిఆర్ఎస్ పార్టీ చిలప్ చెడ్ మండలం మాజీ అధ్యక్షుడు గడ్డం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే ముందే టిఆర్ఎస్ పట్టించుకునేనికే పుట్టగతులు లేవని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ గుర్తిస్తలేదు, తెలంగాణ ఉద్యమం నుండి ఉమ్మడి కౌడిపల్లి కి అధ్యక్షతగా ఉండి ఎమ్మెల్యే చిముముల మదన్ రెడ్డిని గెలిపించామని, జిల్లా టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా పార్టీలో కొనసాగిననని, పార్టీలో గుర్తింపు లేదని, కమ్యూనిస్టు ఉద్యమo నుండి, 2001 నుండి కాంగ్రెస్ టిడిపి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీతో, జనంతో మమేకమై, టిఆర్ఎస్ పార్టీకి కలిసికట్టుగా ఉండి గెలిపించామన్నారు. మండలంలోని ఎ కార్యక్రమమైనా పిలుస్తా లేరు, కించపరచడం మంచిగా లేదనీ, జెడ్పిటిసి టికెట్ కు అర్హులు ఉన్నాగాని రాలేకపోయిందని,గుర్తింపు లేక పోతుందని ఆయన ఎమ్మెల్యే ముందు చెప్పుకున్నారు.




