గద్వాల నడిగడ్డ, ఏప్రిల్ 13 (జనం సాక్షి);ఏప్రిల్ 16న ఉదయం 9 గంటలకు తెలంగాణ స్టేట్ సీపీయస్ ఎంప్లాయీస్ యూనియన్ జోగులాంబ గద్వాల జిల్లా శాఖ అధ్వర్యంలో జిల్లా కేంద్రం గద్వాల లో నిర్వహించే పెన్షన్ కాన్సిట్యూషనల్ ర్యాలీలో జిల్లాలోని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగులందరూ పాల్గొని విజయవంతం చేయాలని గురువారము పోస్టర్ల ద్వారా ప్రచార కార్యక్రమం నిర్వహించమని, అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ అమలు చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా సిపిఎస్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు అన్నారు.ఇందులో భాగంగా మధ్యాహ్న సమయంలో జిల్లా పరిషత్ కార్యాలయం, అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ , ప్రభుత్వ అభ్యసన ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, గంజిపేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల , బురద పేట ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో సీపీఎస్ ఉద్యోగులను ఉపాధ్యాయు లను కలిసినట్లు ఆయన అన్నారు.పాత పెన్షన్ అనేది ఆర్టికల్ 309 ప్రకారం రాజ్యాంగం కల్పించిన ఉద్యోగి హక్కు అని ఆయన అన్నారు. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. పాత పెన్షన్ ర్యాలీలో జిపిఎస్ ఉద్యోగులతో పాటు డిపార్ట్మెంట్ లోని ఇంకో నలుగురు సీపీయస్ ఉద్యోగ ఉపాధ్యాయులను తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిని పై ఉన్నదన్నారు.ఇప్పుడు ఒపియస్ ని సాధించుకోలేకపోతే మళ్ళీ 5 సంవత్సరాలు ఆగాల్సి ఉంటుందని, మరో 5 సంవత్సరాల తర్వాత అయినా మనమే పోరాటం చేయాలన్నారు. సమస్య మనది – పోరాటం మనది – ఫలితం కూడా మనదే నని గుర్తుచేసారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగరాజు తో పాటు జిల్లా క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ నరసింహ, జిల్లా పరిషత్ సిబ్బంది జయరామ్, రవి కుమార్,నర్శిములు, బుడ్డన్న ,దిలవార్ పాష టైపిస్ట్ ,షేక్స్ షా వలీ ,మండల పరిషత్ స్టాప్ శ్రీనివాసులు,మంజుల,హెడ్మాస్టర్ లు జహిరుద్దిన్,గోపీనాథ్,సోమశేఖర రెడ్డి, అగ్రికల్చర్ ఆఫీసర్లు కృష్ణ, శ్రీలత,మహాలక్ష్మి, ఏ.ఈ.ఓ కిరణ్ కుమార్ రెడ్డి, గద్వాల్ టౌన్ ఆర్గనైజింగ్ సెక్రటరిలు- మహిమూద్, కృష్ణ కుమార్,రహిమత్, రాముడు ఉపాధ్యాయులు పిఈటి కృష్ణ, భాను ప్రకాష్,లక్ష్మి ప్రసన్న, టీజీ నరసింహులు,మోహన్, ఫరీద,మోనికా , విద్యా రాణి, శిల్పారాణి, విజయలక్ష్మి, శ్వేత, మాధురీ, కవిత, యువతి, ఉషారాణి,వికారుద్దీన్ తదతరులు పాల్గొన్నారు.




