Thursday, 5 November 2026

టిఆర్ఎస్ ప్రభుత్వానిది తప్పుడు ప్రచారం.. సద్ది సోమిరెడ్డి

టిఆర్ఎస్ ప్రభుత్వానిది తప్పుడు ప్రచారం.. సద్ది సోమిరెడ్డి
బచ్చన్నపేట అక్టోబర్ 27 (జనం సాక్షి) ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేస్తుందని టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని బిజెపి మండల అధ్యక్షులు సోమిరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే సాంస్కృతి టిఆర్ఎస్ దే అని కాంగ్రెస్ లోకి గెలిచిన 12 మంది ఎమ్మెల్యే లని ప్రలోభాలకు గురిచేసి పార్టీ మార్పించిన తెరాస విషయాలు తెలంగాణ ప్రజలకు తెలుసా అని. మునుగోడులో టిఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతున్నాడని తెలుసుకొని తండ్రి కొడుకులు కొత్త నాటకాలు ప్రారంభించారని ఎద్దేవసించారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వారు ఎన్ని జిత్తులు చేసిన మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో. మండల ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి. పిండం నాగేష్. కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు మల్లారెడ్డి. బీజేవైఎం మండల కార్యదర్శి గద్దరాజు. నాయకులు చల్ల మహిపాల్ రెడ్డి. అరకల రాజు. నరసింహులు ఉన్నారు