–
ప్రాణాపాయ స్థితిలో దేవరుప్పుల కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినిలు
జనగామ (జనం సాక్షి)అక్టోబర్27:మంత్రి ఇలాకాలో విద్యార్థుల అస్వస్థత గురికావడం కలకలం రేకెత్తించింది. జనగామ జిల్లా దేవరుప్పుల కస్తుర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ ఘటనలో 25మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురి అయ్యారు. 10 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో విషయం తెలుసుకున్న నిర్వాహకులు వీరిని వెంటనే జనగామ ఏరియా హాస్పిటల్ కి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే దోసకాయ కర్రీ లో బల్లి పడిందని.. దానినే తమకు పెట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. భోజనం తిన్న తరువాత కొద్ది మందికి వాంతులు.. విరోచనాలు అయ్యాయని..దీంతో
అస్వస్థతకు గురయ్యామని వారు పేర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లి దండ్రులు చాలా మంది జనగామ హాస్పిటల్ కి చేరుకున్నారు..
అయితే ప్రస్తుతం విద్యార్థుల ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని.. 24 గంటల పాటు చికిత్స అందాల్సి ఉందని ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ సుగుణకర్ రాజు తెలిపినారు.




