Tuesday, 3 November 2026

టిఆర్‌ఎస్‌లో చేరిన వారికి అధికారిక గుర్తింపు

మండలి ఛైనర్మన్‌ ప్రకటన
హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): టిఆర్‌ఎస్‌లో చేరిన ఇతర పార్టీ సభ్యులను టిఆర్‌ఎస్‌ సభ్యులుగా గుర్తిస్తూ మండలిలో బులిటెన్‌ విడుదల చేశారు. టిడిపి నుంచి చేరిన ఐదుగురు ఎమ్మెల్సీలు టిఆర్‌ఎస్‌ సభ్యులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఓ వైపు ఈ విషయంలో కేసు కోర్టులో ఉండగా, ఇటీవలే హైకోర్టు కూడా నోటీసులు పంపింది. దీంతో టీడీపీ ఎమ్మెల్సీల ఫిరాయింపుల వ్యవహారం కీలక మలుపు తిరిగింది.  సోమవారం తెలంగాణ శాసనమండలి సమావేశాలు ఆరంభమైన అనంతరం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్సీలను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలుగా గుర్తించినట్లు మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ లో చేరిన టీడీపీ శాసనమండలి సభ్యులు వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, నరేందర్‌ రెడ్డి, గంగాధర్‌ గౌడ్‌, మహ్మద్‌ సలీంలను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు గుర్తించినట్లు స్వామిగౌడ్‌ తెలిపారు. రాజ్యాంగం 10 వ షెడ్యూల్‌ అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన ఐదుగురు ఎమ్మెల్సీలను టీఆర్‌ఎస్‌ సభ్యులుగా గుర్తిస్తూ శాసనమండలి ప్రకటించింది. ఆ ఐదుగురు ఎమ్మెల్సీలు.. బి. వెంకటేశ్వర్లు, బి. లక్ష్మీనారాయణ, పట్నం నరేందర్‌రెడ్డి, మహ్మద్‌ సలీం, వి. గంగాధర్‌గౌడ్‌. వీరిని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలుగా మండలి గుర్తించింది. కొద్ది కాలం క్రితం వీరు టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే.ఇక  తెలంగాణ శాసనసభలో ఇద్దరు బీఎస్పీ సభ్యులు తెరాసలో విలీనమయ్యారు. విలీనాన్ని ప్రకటిస్తూ సభాపతి ఉత్తర్వులు జారీ చేశారు. కోనేరు కోనప్ప, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిలను తెరాస సభ్యులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.తెలంగాణ శాసనమండలిలో ఐదుగురు తెదేపా సభ్యులు తెరాసలో కలిశారు. వారిని తెరాస సభ్యులుగా గుర్తిస్తూ మండలి చైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారు. తెరాస సభ్యులతో కూర్చునేందుకు సీట్లు కల్పించాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *