Tuesday, 3 November 2026

వాయిదా పడ్డ తెలంగాణ సభ

హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): తెలంగాణ శాసనసభ మంగళవారం నాటికి వాయిదా పడింది. ఉదయం ప్రారంభమైన శాసనసభ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడింది. మధ్యాహ్నం 12.30 గంటలకు పది నిమిషాల పాటు స్పీకర్‌ టీ బ్రేక్‌ ఇచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఉదయం 9.30 గంటల సమయంలో ఫ్లోర్‌ లీడర్లు సమావేశమై శనివారం నాడు సభలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు. జాతీయగీతాన్ని అవమానించిన టీడీపీ సభ్యులు సభకు క్షమాపణ చెప్పలేదు. వారు క్షమాపణ చెప్పకపోవడంతో వారిని సభ నుంచి సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ మధుసూదనాచారి ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ సభకు  క్షమాపణ చెప్పారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌పై బీజేపీ సభ్యులు స్పందించారు. టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయడం సరికాదని చెబుతూ వారు సభ నుంచి వాకౌట్‌ చేశారు. అనంతరం గవర్నర్‌ ప్రసంగంపై చర్చసాగింది. ఆరూరి రమేశ్‌, గొంగడి సునీత తదితరులు మాట్లాడారు. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *