హైదరాబాద్,నవంబర్24(జనంసాక్షి):హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో జరిగిన కేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జూబ్లిహిల్స్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి గోపీనాథ్, స్థానిక నేత సతీశ్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో సతీశ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయబోయారు. అయితే మేయర్ బొంతు రామ్మోహన్ కల్పించుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఆయన గోపీనాథ్‌తో కలసి చర్చించి వివాదం సద్దుమణిగేలా చేశారు.




