దేవరుప్పుల, ఫిబ్రవరి 11(జనం సాక్షి):జనగామ జిల్లా కేంద్రంలోని శుక్రవారం రోజు ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టి డబ్ల్యూజేఏ) ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జనగామ జిల్లా అధ్యక్షులు గా ధారావత్ అశోక్ నాయక్ ఏకగ్రీవంగా నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక కార్యవర్గ సభ్యులు తేజావత్ రవి నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జనగామ జిల్లాలోని కొడకండ్ల మండలం బోడోనికుంట తండా కు చెందిన ధరావత్ అశోక్ నాయక్ (రాష్ట్ర స్థాయి సావిత్రి బాయి పూలే అవార్డు గ్రహీత),జనగామ జిల్లా ఆర్టిఐ మాజీ ఉపాధ్యక్షులు గా గత అనేక సంవత్సరాలుగా ట్రైబల్ జర్నలిస్టుల హక్కుల కోసం పనిచేస్తున్నందున ఆయన సేవలను గుర్తించి ఈ బాధ్యతలను అప్పగించినట్లు పేర్కొన్నారు. నా మీద నమ్మకంతో అధ్యక్షుడి బాధ్యతలు ఇచ్చినందుకు పెద్దలు రవి నాయక్,లక్ష్మణ్ నాయక్ , ట్రైబల్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.త్వరలోనే జనగామ జిల్లా పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. మార్చి 5న మహబూబాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్ర మహాసభకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.




