హైదరాబాద్,మార్చి9(జనంసాక్షి): ప్రతిపక్షాలు అర్థ రహితంగా మాట్లాడొద్దని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ సూచించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో విూడియాతో మాట్లాడుతూ శాసనసభలో టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు బాగాలేదన్నారు. జాతీయ గీతాన్ని అవమానించిన టీడీపీ సభ్యులు సభకు క్షమాపణ చెప్పకపోవడం దురదృష్టకరమన్నారు. దీనిపై విపరీత వ్యాఖ్యలుచేయడం దారుణమన్నారు. కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. శాసనసభ హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు. ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తూ అర్థ రహితంగా మాట్లాడటం సరికాదన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేసినంతా మాత్రాన తాము ప్రభుత్వం నుంచి దిగిపోయేది లేదన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిదన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటు పడుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను నెరవేర్చే దిశగా ముందుకెళ్తున్నామని ఉద్ఘాటించారు.




