హైదరాబాద్,మార్చి9(జనంసాక్షి): ఆంధప్రదేశ్ శాసనసభ మంగళవారం నాటికి వాయిదా పడింది. సోమవారం సభా సమావేశాలు ప్రారంభమవగానే ప్రతిపక్ష పార్టీ రైతుల సమస్యలపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆ తీర్మానాన్ని తిరస్కరించారు. దీనిపై చర్చించాలన్నారు. సమస్యలపై చర్చించడానికి తమకు అభ్యంతరం లేదని సభా వ్యవహారా మంత్రి యనమలఅన్నారు. వాయిదా తీర్మానాలను తిరస్కరించారు గనక సమస్యలను ఇతర ఫార్మాట్‌లో వస్తే చర్చిస్తామని , సమాధానం చెబుతామని అన్నారు. గవర్నర్ ప్రసంగంలో అన్ని అంశాలను చర్చించే వీలుందని స్పీకర్ సూచించారు. అనంతరం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రజా సమస్యలపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఆ తరువాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగించారు. తరువాత సభాపతి కోడెల శివప్రసాద రావు సభను వాయిదా వేశారు.




