Wednesday, 4 November 2026

టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ కొండమల్లేపల్లి డిసెంబర్ 10 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో శనివారం నాడు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శుభ సందర్భంగా మిఠాయిలు పంచుకుంటూ ఆనందం హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ గతంలో దేవరకొండ శాసనసభ్యులుగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టారని ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ నాయకులకు ప్రజా ప్రతినిధిగా ఎన్నుకునే అవకాశం ఇచ్చారని ఈరోజు దేవరకొండ నియోజకవర్గం లో రాజకీయాలు చేస్తున్న ప్రతి ఒక్క నాయకుడికి బాలు నాయక్ ప్రోత్సాహమే అని మళ్లీ దేవరకొండలో బాలు నాయక్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు అధికారం ఉన్నా లేకున్నా నియోజవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు అండదండలిచ్చారని వారు తెలిపారు రాబోయే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం హస్త గతం చేసుకుంటుందని ఆశాభవం వ్యక్తం చేశారు దేవరకొండ మాజీ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ కి టి పి సి సి ప్రధాన కార్యదర్శిగా నియమించిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు మాజీ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి రావడం అంటే దాదాపు దేవరకొండ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖాయమని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించబోతుందని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఈసారి గెలిపించబోతున్నారని ముఖ్యంగా మన దేవరకొండ నియోజకవర్గం లో నేనావత్ బాలునాయక్ నేతృత్వంలో రేపటినుండి పార్టీ కార్యక్రమాలు చురుగ్గా ఉంటాయని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు టిఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో విసుగు చెల్లిందని ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు