టీపీసీసీ జనరల్ సెక్రెటరీగా ధారాసింగ్ *
పెద్దేముల్ డిసెంబర్ 10 (జనం సాక్షి)
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీగా పెద్దేముల్ జడ్పిటిసి ధారాసింగ్ నాయక్ ను నియమించినట్లు ఏఐసిసి జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్ తెలిపారు. టీపీసీసీ జనరల్ సెక్రెటరీగా ధారాసింగ్ ను నియమించడం పట్ల తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీనీ తాండూరులో మరింత బలోపేతం చేసి రాబోయే సాధారణ ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని పలువురు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ధారాసింగ్ ను జనరల్ సెక్రెటరీగా నియమించినందుకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.




