Wednesday, 4 November 2026

టీపీసీసీ ఉపాధ్యక్షులుగా ఎర్ర శేకర్ ఎంపిక పట్ల హర్షం.. – వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం

టీపీసీసీ ఉపాధ్యక్షులుగా ఎర్ర శేకర్ ఎంపిక పట్ల హర్షం..
– వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం.
– మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి.
ఊరుకొండ, డిసెంబర్ 10 (జనంసాక్షి):
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా టిపిసిసి అధ్యక్షులు టైగర్ ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీలో మార్పులు చేస్తూ కొత్తగా టీపీసీసీ ఉపాధ్యక్షులుగా బీసీ నేత, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ను, మాజీ అధ్యక్షులు ఒబేదుల్ల కొత్వాల్ ను నియమించడం పట్ల శనివారం మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా రేవంత్ రెడ్డి వినూత్న రీతిలో వ్యూహాలను అమలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని.. ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అలుపెరుగని పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని.. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేయాలని ద్యాప నిఖిల్ రెడ్డి పిలుపునిచ్చారు