హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత.. జైళ్ల శాఖలో భారీగా మార్పులు తీసుకోచ్చారు. దీనిలో భాగంగా కొత్తగా మహాపరివర్తన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ఖైదీలలో మానసిక ప్రవర్తనలో మార్పులు తీసుకోచ్చి… వారు మరోసారి నేరాల వైపు మళ్లకుండా ఉండాలనేది జైళ్ల శాఖ ముఖ్య ఉద్దేశం. జైళ్లల్లో ఖైదీలు విడుదల అయిన తర్వాత.. వారికి ఉపాధి కల్పించడానికి జాబ్ ఎన్రోల్ మెంట్ కార్యక్రమం చేపడుతున్నారు. వారికి అవసరమైనా స్కిల్స్ నేర్పించి.. ఉద్యోగం వచ్చే విధంగా తయారు చేసే విధానానికి జైళ్ల శాఖ శ్రీకారం చుట్టనుంది. ఖైదీలను సెమీస్కిల్డ్, నాన్ సెమి స్కిల్డ్‌గా విభజించి.. వారికి కావలసిన స్కిల్స్ అందించేవిధంగా జైళ్లశాఖ ముందుకు వెళ్లనుందని.. ఆ శాఖ డీఐజీ చెప్పారఆదాయాన్వేషణలో జైళ్లశాఖ తగు మార్గాలను ఎంచుకుంది. ఇప్పటికే పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి.. వాటి ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్నారు. అయితే హైదరాబాద్ జైళ్లకే పరిమితమైన ఈ పెట్రోల్ బంకులను.. జిల్లాలకు విస్తరించే ఆలోచనలో ఉంది జైళ్లశాఖ. వీటితోపాటు.. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ ద్వారా.. మరిన్ని పరిశ్రమలు నెలకొల్పి ఖైదీలకు ఉపాధి కల్పించేవిధంగా కృషి చేస్తున్నట్టు చెప్పారు. గ్యాస్ డీలర్‌షిప్‌ను ఏర్పాటు చేసుకోబోతున్నట్టు చెప్పారు. ఇప్పటికే తెలంగాణలోని అన్ని జైళ్లల్లో.. లక్ష టేకు మెక్కలు నాటామని… వాటి ద్వారా రానున్న 15ఏళ్లలో 15వందల కోట్ల ఆదాయం వచ్చే విధంగా తగిన ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్లు తెలిపారు . తెలంగాణలో నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ఓపెన్ ఎయిర్ జైళ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. ఖాళీగా జైలు ప్రదేశాల్లో ఇండస్ట్రియల్ కారిడార్స్, స్కూల్స్ ను ఏర్పాటు చేస్తామంటున్నారు.ఖైదీల కోసం నూతనంగా కొత్త భవనాలను నిర్మించింది జైళ్ల శాఖ. ఉగ్రవాదులు, విఐపి ఖైదీల కోసం ఇప్పటికే భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే విఐపి ఖైదీల కోసం అత్యాధునిక హంగులతో భవనాలను నిర్మాణం చేశారు. ఇందుకు 20కోట్ల నిధులు ఖర్చు చేశారు. విఐపి ఖైదీల గదులు చాలా విలాసవంతంగా ఉండడంతోపాటు.. ప్రత్యేకంగా షటిల్ కోర్టును ఏర్పాటు చేశారు. అయితే సాధారణ ఖైదీలకు వసతులు నామమాత్రంగా ఉండడంతో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో దశల వారీగా అందరు ఖైదీలకు అధునిక హంగులతో భవనాలను నిర్మించి వారి వేల్పేర్కు తగిన ప్రాధాన్యం ఇస్తామని జైళ్లశాఖ ప్రకటించింది.




