సి-బ్లాక్‌లోకి మీడియాకు అనుమతివద్దని ఆదేశం
హైదరాబాద్, ఫిబ్రవరి 23 జనంసాక్షి : తెలంగాణ సచివాలయంలో మీడియాపై ఆంక్షలు పెడతామని కొద్దిరోజులుగా సీఎం అనుకూల పత్రికలో కథనాలు రాగా దానికి అనుగుణంగానే సోమవారం సెక్రటేరియట్‌లో మీడియాపై ఆంక్షలు మొదలయ్యాయి. సి-బ్లాక్‌లోకి మీడియాకు అనుమతి ఇవ్వొద్దంటూ సెక్యూరిటీని ఐఅండ్‌పీఆర్ కమిషనర్ ఆదేశించారు. సీఎం పీఆర్‌వో గదిలో కూర్చున్న మీడియా ప్రతినిధులు వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. దీనికి సంబంధించి నేడోరేపో తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సి-బ్లాక్‌లో మీడియా ప్రతినిధులను పంపించివేయడంపై అన్ని బ్లాకుల్లో ఉన్న మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకుని నిరసన కార్యక్రమానికి సిద్ధమవుతుండంతో వెంటనే సీఎం పీఆర్‌వో అక్కడకు చేరుకుని మీడియా ప్రతినిధులతో మాట్లాడే ప్రయత్నం చేశారు.




