కరీంనగర్: టీఆర్‌ఎస్‌లో దొంగలు, లఫంగిలు చేరారని, టీడీపీని చూసి టీఆర్‌ఎస్ వణుకుతోందని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ పేర్కొన్నారు. జిల్లాలోని మానకొండూరులో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో నేతలు ఎర్రబెల్లి, రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి తెలంగాణకు చంద్రబాబు మోసం చేస్తున్నాడని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని చెప్పారు. వచ్చే నెల 3న కరీంనగర్ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.




