హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.శనివారం రాత్రి టీఆర్‌ఎస్ ఆధినేత కే.చంద్రశేఖర్‌రావుతో ఆయన మూడు గంటల పాటు సుదీర్ఘ భేటీ జరగడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది. తెలంగాణపై కాంగ్రెస్ నాన్చుడు ధోరణి అవలంబిస్తుండడంతో విసుగెత్తిన మరికొందరు కాంగ్రెస్ ఎంపీలు సైతం పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరడానికి సుముఖత చూపిస్తున్నట్లు తెలుస్తుంది.




