టీఆర్‌ఎస్ నాయకులకు క్షీరాభిషేకం
నిజామాబాద్,ఆగస్టు 21(జనంసాక్షి):ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రవేశపెట్టిన దళిత బంధు కార్యక్రమం పట్ల దళితులు ఎంతో సంతోషంగా ఉండాలని అని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని దూస్‌గాం గ్రామంలో అంబేద్కర్ సంఘం దళితులంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని, ఎమ్మెల్సీ కవితకి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కి రుణపడి ఉంటామని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేకి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నీరడి రామరాజు, మాజీ సర్పంచ్ దేవదాస్, అంబేద్కర్ సంఘం నాయకులు ఆనంద్, సంజీవ్, శంకర్, శంకర్, భూషణ్, సురేష్, భాస్కర్, మహేష్, సుమన్, టీఆర్‌ఎస్ నాయకులు లింగయ్య, సదన్ గాల భూమయ్య, టి.రాజు. గ్రామస్తులు పాల్గొన్నారు.