టీఎన్‌సీఏ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ ఎన్నిక

చెన్నై,(జనంసాక్షి): క్రికెట్‌ అసోసియేషన్‌(టీఎన్‌సీఏ) అధ్యక్షుడిగా ఎన్‌ శ్రీనివాసన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరుసగా 12వ పర్యాయం ఆయన ఈ పదవికి ఎన్నిక కావడం విశేషం. 83 వ టీఎన్‌సీఏ జనరల్‌ మీటింగ్‌లో తయనను ఎన్నుకున్నారు. కాశీ విశ్వనాథన్‌ వరుసగా ఏడోసారి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2013-14 సంవత్సరానికి కార్యనిర్వహక కమిటీ ఆఫీస్‌ బేరర్స్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని టీఎన్‌సీఏ తెలిపింది.