హైదరాబాద్ : ఉత్తరాఖండ్ వరద బీభత్సంలో చిక్కుకున్న చార్‌ధామ్ యాత్రికులను కాపాడటంలో భారత సైన్యం కృషి ఎంతో అభినందనీయమని తెదేపా నేత పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రతి ఒక్కరు సైనికులక వందనాలు తెలిపాలని ఆయన సూచించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి తన నెల జీతంతోపాటు సైనిక సంక్షేమ నిధికి మరో నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.




