Thursday, 5 November 2026

టీఎస్పీఎస్సీ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారించాలి

టీఎస్పీఎస్సీ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారించాలి* పంట నష్ట రైతులకు ఆదుకోవాలి
విలేకరుల సమావేశంలో జూలకంటి
మిర్యాలగూడ, జనం సాక్షి టిఎస్పిఎస్సి లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంతోమంది నిరుద్యోగులు సంవత్సరాల తరబడి చదివి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వపై ఉందన్నారు. ఎన్నో ఆశలతో ఉన్న నిరుద్యోగులకు పేపర్ లీకేజీ నిరాశ మిగిల్చిందని వాపోయారు. లీకేజీ వ్యవహారంపై బాధ్యులు ఎవరైనా ఎంతటి వారినైనా వదిలిపెట్టకూడదని కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. పారదర్శకంగా జరగాల్సిన పరీక్షల్లో లీకేజీకి పాల్పడిన వారిని సహించకూడదన్నారు. రద్దయిన పరీక్షలను తిరిగి పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఇటీవల అకాల వర్షాలు కురిసాయని దీనివలన అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. వ్యవసాయ రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టం పై వివరాలు సేకరించాలని కోరారు. తక్షణమే పంట నష్ట సర్వే చేసి నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు అందించాలని కోరారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా నాయకులు రవినాయక్, రాగిరెడ్డి మంగా రెడ్డి, భవాండ్ల పాండు, పాదురి శశిధర్ రెడ్డి, రొంది శ్రీనివాస్, బిఎం నాయుడు, గుణగంటి రాంచంద్రు, పాపి రెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు.