తీసుకోవాలని కలెక్టర్ కు వినతి……………. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు లో జరుగుతున్న అవకతవకల పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి…………….
భువనగిరి (జనం సాక్షి):– భువనగిరి మున్సిపాలిటీ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో ఇంక్వయిరీ విషయం లో జరిగిన అవకతవకల పై విచారణ జరిపించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు అతహర్ వినతిపత్రం అందచేశారు.ఈ సందర్బంగా అతహర్ మాట్లాడుతూ భువనగిరి పట్టణం 30 వ వార్డ్ పహాడి నగర్ లో అర్హులైన మౌలా బేగం అనే ఒంటరి మహిళా పేరు అన్హరురాలు గా ప్రకటించడం తో ఆమె మనస్థాపానికి గురై గుండె పోటు తో ఆదివారం రోజున చనిపోవడం బాధాకరమని అన్నారు.అసలు అధికారులు విచారణ ఎలా చేపడుతున్నారని ఆమె కు సొంత ఇళ్ళు లేకున్నా సొంత ఇళ్ళు ఉందనే కారణం చూపి అన్హరురాలుగా ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. ఆమె ఎన్నో ఏళ్లు గా అద్దె ఇంటిలో ఉంటూ ఒంటరి మహిళ పెన్షన్ పొందుతూ జీవనం గడుపుతున్నారని ఆమెకు సొంత ఇళ్ళు ఉన్నదని అధికారులు రుజువు చేయాలని సవాల్ చేశారు .ఆమె కుటుంబానికి వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా మౌలా బేగం కు సొంత ఇళ్ళు ఉందనే కారణం తో ఆమెను అన్హరురాలు గా ప్రకటించి ఆమె మృతి కి కారణమైన అదికారుల పై చర్యలు తీసుకోవాలని కోరారు .మౌలా బేగం కుటుంబానికి న్యాయం చేయని యెడల రాష్ట్ర మైనారిటీ కమిషన్ ను ఆశ్రయిస్తామని అన్నారు.అంతే కాకుండా చాలా మంది ఇళ్ళు లేని వారిని అన్హరులు గా ప్రకటించి సొంత ఇళ్ళు ఉన్న వారిని అర్హులుగా ప్రకటించడం జరిగిందని దీని ద్వారా అవకతవకలు జరిగాయని తెలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు . అధికారులు కేవలం ఒక చోట కూర్చుని ఇంక్వయిరీ చేయడం సరైంది కాదని వారు ప్రతీ ఇంటికి తిరిగి ఇంక్వయిరీ చేయాలని అవసరం అయితే వార్డ్ పెద్దలతో ఒక కమిటీ వేసి వారి ద్వారా సమాచారం సేకరించి తిరిగి అర్హుల జాబితా తయారు చేయాలని డిమాండ్ చేసారు. లేనియెడల వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అధికారులను ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం పార్టీ నాయకులు నివాస్, రాకేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు లో జరుగుతున్న అవకతవకల పై చర్యలు




