Wednesday, 4 November 2026

టీఎస్పీఎస్ లీకేజ్ ప్రశ్నపత్రం లీకేజీ పై యువజన కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి .

 

 

 

 

 

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–టీఎస్పీఎస్సీ, 10వ తరగతి ప్రశ్నాపత్రాలపై లీకేజీలపై తెలంగాణ ఎమ్మెల్యేల మౌనానికి నిరసనగా ఈరోజు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివ సేన రెడ్డి పిలుపుమేరకు .యాదాద్రి భువనగిరి జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే  పైళ్ల శేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయం ముట్టడికి బయలుదేరిన యువజన కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా  కమిటీ నాయకులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద అరెస్టు చేసి స్థానిక భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా బర్రె నరేష్ మాట్లాడుతూ తక్షణమే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నైతిక బాధ్యత వహిస్తూ,  సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు అయిన వారిని పరామర్శించడానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి  ప్రమోద్ కుమార్, బోనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జాంగిర్, వీరపాక నరసింహ,nsui  జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ మద్దతు తెలిపారు అరెస్ట్ అయిన వారిలో రాష్ట్ర కార్యదర్శి  వంగాల వెంకన్న ,వరుణ్ గౌడ్ ,అసెంబ్లీ ఉపాధ్యక్షులు కొల్లూరు రాజు, పడిగల ప్రదీప్, బొజ్జ రవితేజ, వనగంటి వెంకటేష్,  నరేష్ గౌడ్, బుగ్గ రమేష్ ,సాయి హరీష్ తదితరులు ఉన్నారు ముందస్తు అరెస్టు అయిన వారు పుట్ట గిరీష్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి మనోజ్ యాదవ్, బద్దం వాసుదేవా రెడ్డి తదితరులు ఉన్నారు.