Thursday, 5 November 2026

టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై నిరసనగా కేసీఆర్,

 కేటీఆర్ దిష్టిబొమ్మలు దగ్దం చేసిన మెట్ పల్లి కాంగ్రెస్టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై నిరసనగా కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మలు దగ్దం చేసిన మెట్ పల్లి కాంగ్రెస్మెట్ పల్లి టౌన్, మార్చి 19, జనంసాక్షి:
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ కేంద్రంలోని పాత బస్టాండ్ శాస్త్రి విగ్రహం ముందర టిపిసిసి చీఫ్ ఎంపీ రేవంత్ రెడ్డి,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లురి లక్ష్మణ్ కుమార్ పిలుపు మేరకు కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జి పిసిసి డెలిగేట్ జువ్వాడి నర్సింగ రావు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు  సూచనలతో  పట్టణ మరియు మండల కాంగ్రెస్ అధ్వర్యంలో సీఎం కేసీఆర్ కేటీఆర్ లను దిష్టిబొమ్మలను దగ్దం చేయడం జరిగింది..అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ యువతను మోసం చేస్తూ పబ్బం గడిపి లేక లేక ఒక నోటిఫికేషన్ ఇచ్చి దానిని కూడా లీక్ చేయడం అనేది దారుణం అని అన్నారు..  నీళ్ళు నిధులు నియామకాలను బిఆర్ఎస్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర పాలనను గాలికి వదిలిన వైఖరికి నిదర్శనమే పేపర్ లికేజ్ అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పోటీ పరీక్షలను కూడా సమర్థంగా నిర్వహించే అవకాశం కూడా లేకపోవడం చూస్తుంటే ఇక రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని ఏ విధంగా కాపాడుతారని ఎద్దేవా చేసారు. పేపర్ లీక్ ఘటనకి సంబంధించిన బాధ్యులను కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.. టిఎస్ పీఎస్సీ చైర్మెన్ మరియు సభ్యులను పదవుల నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..రద్దు చేసిన పరీక్షలను కాలయాపన చేయకుండా వెంటనే పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డాక్టర్ భెజ్జరపు శ్రీనివాస్ .మైనార్టీ నాయకులు అడ్వకేట్ అబ్దుల్ హఫీజ్,  కొమిరెడ్డి లింగారెడ్డి అడ్వకేట్. మెట్పల్లి మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి అంజిరెడ్డి  మెట్ పల్లి మండల ఉపాధ్యాక్షులు ఇల్లెందుల రాజు    యూత్ కాంగ్రెస్ పట్టణ  అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్ గోరుమంతుల ప్రవీణ్ ఉప సర్పంచ్ ,బొడ్ల ఆనంద్ ,అశోక్ భూమేష్ ,చెన్నూరి శివ తదితరులు పాల్గొన్నారు