హైదరాబాద్: పార్లమెంటరీ సెక్రటరీ బిల్లును ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ శాసనమండలిలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు పోలీస్ కమిషనరేట్ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం సభలో పార్లమెంటరీ సెక్రటరీల బిల్లుపై చర్చ జరుగుతోంది. ఈ రోజు మండలి సమావేశాలకు ఆఖరు రోజు కావడంతో పలు బిల్లులు ఈ రోజు మండలిలో ఆమోదం పొందనున్నాయి. ఈ రోజు పలువురు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు.




