హైదరాబాద్:ప్రముఖ సినీ నటి శృతిహాసన్ ఒప్పందం ప్రకారం ఓ మల్టీ స్టారర్ చిత్రంలో నటించకుండా తప్పుకున్నందుకు ఆమెపై పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్ సివిల్ కోర్టు లో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ ను విచారించిన సివిల్ కోర్టు న్యాయమూర్తి ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని కోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వేరే సినిమాలకు శృతి సంతకం చేయకూడదంటూ ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చింది. నటులు నాగార్జున, కార్తీ కాంబినేషన్ లో పిక్చర్ హౌస్ మీడియా సంస్థ ఓ సినిమా నిర్మిస్తోంది. ఇందులో హీరోయిన్ గా శృతిని ఎంచుకున్నారు.




