విదేశాంగ శాఖ కొత్త అధికార ప్రతినిధిగా వికాస్ స్వరూప్

ఢిల్లీ:కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త అధికారి ప్రతినిధిగా వికాస్ స్వరూప్ నియమితులు కాబోతున్నారు. ‘క్వశ్చన్ అండ్ ఆన్సర్స్’ పుస్తకంతో స్వరూప్ పాపులర్ అవగా, ఈ పుస్తకం ఆధారంగా ‘స్లమ్ డాగ్ మిలియనేర్ అనే హాలీవుడ్’ చిత్రం తెరకెక్కింది. 1986 ఐఎఫ్ఎస్ బ్యాచ్ కు చెందిన స్వరూప్ ప్రస్తుతం ఐరాస రాజకీయ విభాగంలో ఉమ్మడి కార్యదర్శిగా పని చేస్తున్నారు.