Thursday, 5 November 2026

టీఎస్ యుటిఎఫ్ మహాసభలకు తరలిన టేకులపల్లి నాయకులు

టీఎస్ యుటిఎఫ్ మహాసభలకు తరలిన టేకులపల్లి నాయకులు

టేకులపల్లి, డిసెంబర్ 4 (జనం సాక్షి): టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో మణుగూరులో జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభలకు టేకులపల్లి యుటిఎఫ్ మండల శాఖ నుంచి ఆఫీస్ బెరర్స్,కార్యకర్తలు సుమారు 25మంది వరకు పాల్గోన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు సాధనకై ఐక్యత తో ఈ విధంగానే ముందుకు సాగాలని, జిల్లా నాయకులు, సోషల్ మీడియా కన్వీనర్ మాలోతు బాలు నాయక్ కోరారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు మంగతాయి, నరసింహారావు, నాయకులు రామచంద్ర రావు, జానకి దేవి తదితరులు పాల్గొన్నారు.