Wednesday, 4 November 2026

టీఎస్.యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

టీఎస్.యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి:

ఇంద్రవెల్లి : జనవరి 10( జనం సాక్షి)ఈనెల 13, 14 తేదీల్లో రంగారెడ్డి జిల్లాలోని మన్నెగూడలో నిర్వహిస్తున్న టీఎస్ యు టీ ఎఫ్ రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని మండల అధ్యక్షులు ఆడే సురేష్ పిలుపునిచ్చారు. మంగళవారం జెడ్పీఎస్ఎస్ పాటశాలలో మహాసభలకు సంబంధించిన గోడప్రతులను విడుదల చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మహాసభలకు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఉపాధ్యాయ ఎం ఎల్ సి అలుగుబెల్లి నర్సిరెడ్డి , ఎమ్మెల్యేలు, ఎంపిలు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు హాజరవుతున్నారు. కేరళ ప్రభుత్వ విప్, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కె కె శైలజ వక్తగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. కావున ఈ మహాసభలకు ఉపాధ్యాయులు, విద్యారంగ శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గణేష్,నాయకులు సుకుమార్,రవీంద్ర చారి,సంతోష్,నారాయణ, విఠల్, రిమా,స్వరూప రాణి,కవిత,సుజాత,సంధ్య తదితరులు పాల్గొన్నారు.