Wednesday, 4 November 2026

టీచరు జుట్టు కత్తిరించేసింది!

, హైదరాబాద్‌: ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు విద్యార్థిని జుట్టు సరిగ్గా దువ్వుకోలేదని ఏకంగా తానే జుట్టు కత్తిరించేసింది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుందివివరాల్లోకెళితే.. ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాలకు వచ్చేటప్పుడు జుట్టు సరిగ్గా దువ్వుకోలేదని ఉపాధ్యాయురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు శిక్షగా తానే కత్తెర తీసుకుని విద్యార్థిని జుట్టును కత్తిరించేసింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పాఠశాల వద్ద నిరసన ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయురాలిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి హామీ ఇచ్చాక వారు ఆందోళన విరమించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *