Tuesday, 3 November 2026

టీటీడీ ‘మనగుడి’కి ఏర్పాట్లు పూర్తి

హిమాయత్‌నగర్‌ : ప్రభుత్వ దేవాదాయ శాఖ, టీటీడీ-ధర్మప్రచార పరిషత్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి నిర్వహించతలపెట్టిన ‘మనగుడి’ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ధర్మప్రచార పరిషత్‌ హైదరాబాద్‌ ఏఈఓ ఉషానందిని తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 27న ఆలయ శుద్ధి, 28న వరలక్ష్మి వ్రతాలు, 29న మనగుడి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. హైదరాబాద్‌లో 616, రంగారెడ్డి జిల్లాలో 500 ఆలయాలలో మనగుడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మనగుడికి సంబంధించిన పూజాసామాగ్రిని టీటీడీ ప్రధాన కార్యాలయం సమకురుస్తోందని, ఇందులో కలకంద, స్వామివారి అక్షతలు, కంకణాలు, పసుపు, కుంకుమ ఉంటాయని చెప్పారు. బుధవారం లిబర్టీలోని బాలాజీభవన్‌లో పూజా సామాగ్రిని ఆల యాల ప్రతినిధులకు అందచేస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *