Thursday, 5 November 2026

పరీక్షకు ఓకే.. ఫలితాలు ఇవ్వొద్దు

జూనియర్ సివిల్ జడ్జిల నియామక పరీక్షలు యథావిధిగా జరపొచ్చని హైకోర్టు అనుమతించింది. ఈ పరీక్ష నిర్వహణపై అభ్యంతరం తెలుపుతూ వేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. పరీక్షల తర్వాత జవాబు పత్రాలను వాల్యుయేషన్ చేయకుండా సీల్డ్ కవర్ లో భద్రపర్చాలని కోర్టు ఆదేశించింది. తుది తీర్పు వచ్చిన తర్వాతే ఫలితాలు వెల్లడించాలని పేర్కొంది. వారంలోపు పిటిషనర్లు తమ అభిప్రాయాలను కోర్టుకు తెలపాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మరో రెండు వారాలపాటు వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *