Wednesday, 4 November 2026

టీపీటీయు క్యాలెండర్ డైరీని ఆవిష్కరించిన మంత్రి జగదీష్ రెడ్డి

టీపీటీయు క్యాలెండర్ డైరీని ఆవిష్కరించిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ నూతన సంవత్సరం 2023 క్యాలెండర్ తో పాటు డైరీని గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి , ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు మట్టపల్లి రాధాకృష్ణ , జిల్లా అధ్యక్షులు భూపతి శ్రీనివాస్ గౌడ్ , ప్రధాన కార్యదర్శి బచ్చుపల్లి శంకర్ రావు, రాష్ట్ర బాధ్యలు కల్లూరి నాగయ్య , ఏనుగుతల రమేష్ , మధుసూదనరావు ,జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ నిమ్మల శ్రీనివాస్, నాయకులు ముంత శ్రీనివాస్ , కడపర్తి శ్రీనివాస్ నాయుడు , వరిపెల్లి అంజయ్య ,గుణగంటి కృష్ణ ,విసవరం శ్రీనివాస్ రెడ్డి ,
ఉదయ్ , ధర్మయ్య , సంగం వీరయ్య , సోమగాని రమేష్ ,రామకృష్ణ , చిత్తలూరి శ్రీనివాస్ , సర్దార్ సింగ్ ,అరుణ ,మాధవి తదితరులు పాల్గొన్నారు.