Wednesday, 4 November 2026

సేవా రత్న జాతీయ అవార్డు అందుకున్న . జంగిటి నరేష్

సేవా రత్న జాతీయ అవార్డు అందుకున్న . జంగిటి నరేష్
బచ్చన్నపేట జనవరి4(జనం సాక్షి)కల్మషం లేని మనస్తత్వం, అందరి మంచికోరే వ్యక్తిత్వం..
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నిగర్వి..
ఎల్లప్పుడూ నవ్వుతూ ఆత్మీయంగా పలకరించే మంచి మనసున్న మారాజు జనగామ జిల్లా. బచ్చన్నపేట మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన జంగిటి నరేష్
అన్యాయం, అక్రమాలను సహించని ఆర్టీఐ ఆక్టివిస్టు,ప్రశ్నించేగొంతుక, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ (NHRC) జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ జంగిటి నరేష్ ఈ రోజు హైదరాబాద్ లో తల్లి సావిత్రి భాయ్ పూలే192 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహాజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో సోషల్ ఆక్టివిటీ(సేవల) విభాగంలో సేవారత్న జాతీయ అవార్డును అందుకున్నరు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ఈ అవార్డుమరింత బాధ్యత పెంచిందని న్యాయం కోసం ప్రజల తరఫున పోరాటం చేయడానికి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు అయిన సాహిత్య నిపుణులు శ్రీ గోరేటి వెంకన్నMLC, తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మెన్ *జూలూరి గౌరీశంకర్ అవార్డు ప్రదానోత్సవ రూపకర్త, మహాజన సాహిత్య అకాడమీ రాష్ట్ర కో కన్వనర్ గద్దల మహేందర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు *గోరేటి వెంకన్న మరియు జూలూరి గౌరీశంకర్ గరలు మాట్లాడుతూ చిన్న వయస్సులో జాతీయ సేవా రత్న అవార్డు అందుకున్న జంగిటి నరేష్ ను అభినందించారు, సేవలలో ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో సేవల విభాగంలో పెద్దల సభలో స్థానం ఉంటుందని అన్నారు