Wednesday, 4 November 2026

టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభ వాల్ పోస్టర్లు ఆవిష్కరించిన దేవరకొండ ఎమ్మెల్యే,బిఆర్ఎస్ పార్టీ

టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభ వాల్ పోస్టర్లు ఆవిష్కరించిన దేవరకొండ ఎమ్మెల్యే,బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్
కొండమల్లేపల్లి జనవరి 6 జనం సాక్షి న్యూస్ :
ఈనెల 8 తేదీన హైదరాబాద్ లో జరిగే టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకొండ శాసన సభ్యులు,బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ గారు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అల్లం నారాయణ నాయకత్వంలో టీయూడబ్ల్యూజే యూనియన్ ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.జర్నలిస్టుల సంక్షేమం కోసం జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటుచేసిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజె డివిజన్ నాయకులు, కొమ్మినేని ఆంజనేయులు యాదవ్, సయ్యద్ పాష, సముద్రాల వేణు, సింగం నారాయణ, బిజిలి లింగం, వంగాల రమేష్ చారి, ముసిని అంజన్, వాంకునావత్ సుభాష్ నాయక్, బూడిద శ్రీనివాస్ యాదవ్, సంకోజు మని, చిలువేరు శ్రీధర్, ముదిగొండ రాందాస్ మరియు మొహినుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.