టీ కాంగ్రెస్ నేతల సమావేశం డ్రామా: కోదండరాం
ఆదిలాబాద్,(జనంసాక్షి): ప్యాకేజీలు మాకు వద్దు.. పది జిల్లాలతో కూడిన తెలంగాణే కావాలని జేఏసీ ఛైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. టీ కాంగ్రెస్ నేతల సమావేశం ఓ డ్రామా అని తెలిపారు. చిత్తశుధ్ది ఉంటే అధిష్ఠానంతో కొట్లాడాలని పేర్కొన్నారు. జులై 4 నుంచి తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలను పల్లెల్లో తిరగనీయకుండా అడ్డుకుంటామని చెప్పారు. బైండోవర్ల పేరుతో కేసులు నమోదు చేశారని, భవిష్యత్‌లో మరిన్ని ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు.