మంచిర్యాల : తెలంగాణ ప్రాంతానికి ప్యాకేజీలు అవసరం లేదని హైదరాబాద్ రాజధానితో కూడిన పది జిల్లాల తెలంగాణ కావాలని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం అన్నారు. అదిలాబాద్ జల్లా మంచిర్యాలలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు… తెలంగాణ సాధన కోసం శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తే …. తెలంగాణ ప్రజలను హైదరాబాద్ రానీయకుండా బైండోవర్లు చేస్తూ అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. జులై 4 నుంచి కాంగ్రెస్ నాయకులను పల్లెల్లోకి రాకుండా తెలంగాణ వాదులు అడ్డుకుంటారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐకాస మంచిర్యాల తూర్పు జిల్లా ఛైర్మన్ శ్యామ్సుందర్రావు, జిల్లా ఛైర్మన్ శ్యామ్సుందర్రావు, జిల్లా కన్వీనర్ రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.




