వరంగల్ ఈస్ట్, మే 12 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని కరీనాబాద్ లో గల కివి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫలితాలలో 10/10 జిపిఎ సాధించారు. ఈ మేరకు పాఠశాల ప్రిన్సిపాల్ దాసి సతీష్ మూర్తి తెలిపారు. టెన్ బై టెన్ జిపిఎస్ సాధించిన విద్యార్థులలో ఎన్. శ్రీజ, డి. లక్ష్మి సహస్ర, సూర్యచరణ్ విద్యార్థులు ఉన్నట్టు తెలిపారు. అదేవిధంగా 38 మంది విద్యార్థులు 9 జీపీఏ కంటే ఎక్కువ సాధించినట్లు వివరించారు. వరంగల్ జిల్లా స్థాయిలో రెండవ స్థానం సాధించినట్లు సతీష్ మూర్తి వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో అన్నదేవర ప్రవీణ్ కుమార్, దాసి రజిని ఇంతియాజ్, శాంతకుమారి రజిత తదితరులు పాల్గొన్నారు.




