Thursday, 5 November 2026

సీఎం కప్ మండల స్థాయి క్రీడాలను విజయవంతం చేయాలని ఎంపీపీ మాసుల శ్రీనివాస్ వెల్లడి చేగుంట మండలంలో వైభవంగా క్రీడాలు జరగాలి అధికారులకు సూచన ఎంపీపీ

 

 

 

 

 

 

 

 

చేగుంట జనం సాక్షి మే 12మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఈ నెల 15 నుంచి 17.వరకు జరిగే మండల స్థాయి సీఎం కప్ , మండల స్థాయి క్రీడలను విజయవంతం చేయాలని చేగుంట మండలం ఎంపీపీ మా సుల శ్రీనివాస్ పేర్కొన్నారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సీఎం కప్ 2023 క్రీడా పోటీలకు మండల స్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు చేయవలసిందిగా అధికారులకు చేగుంట మండలం ఎంపీపీ మాసుల శ్రీనివాస్ గురువారం నాడు ఎంపీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సమావేశంలో సూచించారు.అనంతరం భారీ ఎత్తున విద్యార్థులు పాల్గొనే విధంగా చూడాలని అధికారులకు వివరించారు .అదేవిధంగా మండల ప్రత్యేక అధికారి జయరాజు అన్నారు,చేగుంట మండల పరిషత్ కార్యాలయంలో మండల అధికారులతో సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం , జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించే సీఎం కప్ మండల స్థాయి క్రీడలను చేగుంట మండలంలోని 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసుగల వారు ఆసక్తి గల క్రీడాకారులు చేగుంట మండల పరిషత్ కార్యాలయం మండల వనరుల కేంద్రంలో క్రీడాకారుల యొక్క నివేదిక సమర్పించాలని వారు కోరారు, ఈ మండల స్థాయి క్రీడల్లో, ఫుట్బాల్, వాలీబాల్ , కబడ్డీ ,కోకో, అథ్లెటిక్స్ , క్రీడలకు కావలసిన ఏర్పాట్లు జరుగుతున్నాయని వారు తెలిపారు, చేగుంటలో అనేక క్రీడల్లో జిల్లా ,రాష్ట్ర స్థాయి ,అంతర్జాతీయ, స్థాయిలో పథకాలు సాధించిన ఘనత చేగుంట మండలంకు ఉందన్నారు , మండలంలో వివిధ ఆటలకు సంబంధించిన క్రీడాకారులు అనేక మంది మండలంలో ఉన్నారని, వీరందరూ క్రీడల్లో పాల్గొని చేగుంట మండలము యొక్క కీర్తి ని జిల్లా స్థాయిలో నిలిపి మంచి గుర్తింపు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని కోరారు,ఈ కార్యక్రమంలో తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, ఎంపీడీవో ఆనంద్ మేరీ, చేగుంట ఎస్సై ప్రకాష్ గౌడ్, మండల్ నోడల్ అధికారి రమేష్ , చేగుంట ఈవో నాగ భూషణం, సీనియర్ అసిస్టెంట్ శ్రీశైలం, జూనియర్ అసిస్టెంట్ విజయ్, పి ఈ టి మంజులత, అంజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు,